Header Banner

ప్రశ్నించే స్థాయిలో మొదలైన జనసేన… పరిష్కారం చూపే స్థాయికి ఎదిగింది! మంత్రి కీలక వ్యాఖ్యలు!

  Fri Mar 14, 2025 22:53        Politics

జనసేన పార్టీ ప్రయాణం చాలా కష్టమైనది, అనేక అవమానాలను ఎదుర్కొన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజుల్ని మర్చిపోలేమని, అలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ తనతో పాటు నిలబడ్డ ప్రతి ఒక్కరినీ గౌరవించారని తెలిపారు. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారని, జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచిందని స్పష్టం చేశారు. యువతరాన్ని నాయకత్వంగా మారుస్తామన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, జనసేన అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా తన విధానాల్లో మార్పు ఉండదని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకార భరోసా చేపట్టామని, 2019లో జనసేన భవిష్యత్తుపై సందేహాలున్నా కార్మికులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. రాష్ట్రం కోసం జనసేన ప్రారంభమైందని, ఇక దేశం కోసం పనిచేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. పదవులు వచ్చినా రాకున్నా పార్టీకి అండగా ఉంటామని స్పష్టంగా ప్రకటించారు. ప్రజలకు పథకాలు అందేలా జనసేన నేతలు కృషి చేయాలని సూచించారు. ప్రశ్నించే స్థాయిలో మొదలైన జనసేన, పరిష్కారం చూపే స్థాయికి ఎదిగిందని, ఈ పోరాటంలో 463 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు పవన్ అండగా నిలిచారని వివరించారు. జనసేన అడుగులు ఎప్పుడూ సామాన్యుడివైపే నడుస్తాయని, ప్రజలకు మేలు చేసేందుకు ఈ పార్టీ కట్టుబడి ఉందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #janasena #nadendlamanohar #todaynews #flashnews #latestnews